Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Khushbu Sundar: సీఎం విజయ్‌ను కలిసిన కుష్బూ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?

Khushbu Sundar: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త, సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, సీనియర్ నటి కుష్బూ సుందర్..

సీఎం జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన పెద్ద కుమార్తె అవంతిక వివాహానికి రావాల్సిందిగా సీఎం విజయ్‌ను ఆమె వ్యక్తిగతంగా ఆహ్వానించారు. చెన్నైలోని సీఎం విజయ్ నివాసానికి వెళ్లిన కుష్బూ ఫ్యామిలీ.. శ్రావణ్ శ్రీనివాసన్‌తో జరగనున్న వారి కూతురి పెళ్లి పత్రికను ఆయనకు అందజేశారు.

Also Read :Panja Vaisshnav: మూడేళ్ల గ్యాప్.. 100 కథల రిజెక్షన్! ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్‌లో పెట్టిన మెగా హీరో

ముఖ్యమంత్రి విజయ్‌తో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను కుష్బూ సుందర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ను తన "ప్రియమైన సోదరుడు" అని సంబోధిస్తూ ఆమె ఎమోషనల్ అయ్యారు. తమిళనాడులో బీజేపీ వర్సెస్ టీవీకే (TVK) అన్నట్లుగా రాజకీయ వాతావరణం హీటెక్కుతున్న తరుణంలో.. ఈ ఇద్దరు కీలక నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాల కంటే పాత అనుబంధాలు, సినీ ప్రపంచంతో ఉన్న వ్యక్తిగత సంబంధాలే ముఖ్యమని ఈ కలయిక నిరూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా.. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ఆత్మీయ కలయికపై నెటిజన్లు, ఇరు పార్టీల అభిమానులు సానుకూలంగా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi