Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Korean Kanakaraju OTT: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Korean Kanakaraju OTT: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

సక్సెస్‌ఫుల్ థియేట్రికల్ రన్‌ అనంతరం ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుందని తెలిపారు.

'కొరియన్ కనకరాజు' కథ విషయానికొస్తే.. అనంతపురం జిల్లా పెనుగొండలో కనకరాజు (వరుణ్ తేజ్) తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి చెక్కభజన బృందాన్ని నడుపుతూ సరదాగా జీవిస్తుంటాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన చైత్ర (రితిక నాయక్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే చైత్రకు మాత్రం ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడే స్థిరపడాలనే కల ఉంటుంది. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆమె కియా కార్ల తయారీ యూనిట్‌లో పనిచేస్తుంటుంది. అయితే కనకరాజు జీవితంలోకి అనుకోని పరిణామం వస్తుంది. అతనిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి అతడి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ ఆత్మ కారణంగా కనకరాజు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అసలు అతను కొరియా వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చివరికి ఆ కొరియన్ ఆత్మ కనకరాజును వీడిందా? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. హారర్, కామెడీ, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi