Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Krishna Burugula : నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డుతో సంచలనం!

తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, తన కెరీర్ ఆరంభంలోనే యావత్ చిత్ర పరిశ్రమ షాక్ అయ్యేలా ఒక సాహసోపేతమైన సవాల్ విసిరిన ధైర్యవంతుడు కృష్ణ బురుగుల.

"ఈ సినిమాతో నేను మిమ్మల్ని నవ్వించలేకపోతే.. మళ్ళీ కెమెరా ముందుకు రాను, నటననే మానేస్తాను. మార్క్ మై వర్డ్స్!" అంటూ ఆయన గర్జించినప్పుడు, లోకం అది 'అతివిశ్వాసం' అని పెదవి విరిచింది. కానీ, ఆ మాట వెనుక మూడేళ్ల కఠోర శ్రమ, తన ప్రతిభపై తనకు ఉన్న అచంచలమైన నమ్మకం ఉందని నేడు నిరూపితమైంది.

సాధారణంగా ఏ నటుడైనా సేఫ్ గేమ్ ఆడాలని చూస్తారు, కానీ కృష్ణ మాత్రం తన కెరీర్‌నే పణంగా పెట్టారు. ఇది ఆయనకు నటనపై ఉన్న పిచ్చిని, ప్రేక్షకులపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఆ నాడు ఆయన విసిరిన సవాల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించగా, నేడు ఆయన అందుకున్న విజయం అంతకంటే పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.

అతివిశ్వాసం కాదు.. అది ఆత్మవిశ్వాసానికి పట్టాభిషేకం!

'జిగ్రీస్' సినిమా ప్రమోషన్లలో కృష్ణ బురుగుల అన్న మాటలు అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. కానీ, cinemalo ఆయన పండించిన హాస్యం, పలికించిన హావభావాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఆయన చేసిన ఆ 'మ్యాజిక్' ఫలితమే నేడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఆయనను వరించిన 'ఉత్తమ హాస్య నటుడు' (Best Comedian) అవార్డు. స్టేజ్ మీద కృష్ణ ఆ అవార్డును అందుకుంటుంటే, నాడు విమర్శించిన వారే నేడు గర్వంగా చప్పట్లు కొడుతున్నారు. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు, తన కెరీర్‌ను పణంగా పెట్టి పోరాడిన ఒక యోధుడికి దక్కిన విజయ గీతం. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్రాలు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

Also Read :ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్

ప్రేక్షకులే తన సైన్యం.. 'జిగ్రీస్' కృష్ణ ఒక ఎమోషన్!

కృష్ణ బురుగుల కేవలం ఒక నటుడిగా మిగిలిపోలేదు. 'జిగ్రీస్' లోని ఆయన పాత్రను ప్రేక్షకులు తమ సొంత స్నేహితుడిగా, తమ ఇంట్లో మనిషిగా భావించారు. ఎంతోమంది 'అతివిశ్వాసం' అని ట్రోల్ చేసినా, వాటన్నింటినీ తన హార్డ్ వర్క్‌తో మెప్పించి, నెగటివిటీని పాజిటివిటీగా మార్చుకున్నారు. ప్రతిభకు ఆత్మవిశ్వాసం తోడైతే విజయం కాలి చెంతకు ఎలా వస్తుందో కృష్ణ నిరూపించారు. నేడు ఆయన ఒక స్టార్‌గా అవతరించారు.

ప్రస్తుతం ఆడియెన్స్‌లో కృష్ణ బురుగుల పేరు మారుమోగిపోతోంది అవకాశాలు క్యూ కడుతున్నాయి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా, ఆయన మాత్రం అస్సలు తొందరపడటం లేదు.

క్వాంటిటీ కాదు.. క్వాలిటీ ముఖ్యం: వంద సినిమాలు చేయడం కంటే, వంద ఏళ్లు గుర్తుండిపోయే పది సినిమాలు చేయడమే తన లక్ష్యం అని ఆయన నిరూపిస్తున్నారు.

సినిమా ఎంపిక విషయంలో ఆయన చూపిస్తున్న పట్టుదల, తన స్థాయికి తగ్గ స్క్రిప్ట్‌ల కోసం ఆయన చేస్తున్న నిరీక్షణ అభినందనీయం.

నిజంగానే, ఇదే పద్ధతిలో ఆయన ముందుకు సాగితే.. రాబోయే ఐదేళ్లలో టాలీవుడ్ టాప్ లీగ్ నటుల జాబితాలో కృష్ణ బురుగుల పేరు వినిపిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నాడు సవాల్ విసిరిన గొంతు.. నేడు అవార్డుతో సమాధానం చెప్పింది. గెలుపు బాటలో దూసుకుపోతున్న ఈ నవ్వుల వీరుడికి ఇవే మా శుభాకాంక్షలు!.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi