Thursday, 21 Jan, 6.50 pm తెలుగు మిర్చి

తాజావార్తలు
లాభాల్లో రెడ్

రామ్ ,నివేదా పేతు రాజ్ జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం రెడ్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ (జనవరి 13) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ డ్యూయల్ రోల్ చేసాడు. రెండు విభిన్న పాత్రల్లో హీరో ఒదిగిపోయిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ రాగా.. తర్వాతి రోజుల్లో కూడా కలెక్షన్లు గట్టిగానే రాబడుతుంది.

ఏడు రోజులకుగాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకు వరకు వసూళ్లు సాధించింది. ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ టార్గె 14.5 కోట్లు కాగా ఇప్పటి వరకు 3.5 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇంకొన్ని రోజుల వాటాకు పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి ఈ సినిమాకు మంచి రన్ లభించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాను మలయాళంలో కూడ విడుదలచేస్తున్న సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: telugumirchi
Top