Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Lenin OTT : అఖిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి 'లెనిన్' !

ఖిల్ అక్కినేని హీరోగా నటించిన యాక్షన్ డ్రామా 'లెనిన్' థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అఖిల్ కెరీర్‌లో ప్రత్యేక విజయంగా నిలిచింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read :Akhil Akkineni: డబ్బు కాదు.. విలువలే నేర్పించారు.. అఖిల్ అక్కినేని ఆసక్తికర కామెంట్స్

1990ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో సాగే ఈ కథలో లెనిన్ అనే అనాథ యువకుడి జీవితమే ప్రధానాంశం. గ్రామంలో ప్రతి ఏడాది జరిగే ద్రౌపదమ్మ జాతర సమయంలో చోటుచేసుకునే సంఘటనలు, అతనికి ఎదురయ్యే అనుకోని పరిస్థితులు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. స్నేహం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం వంటి భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రంలో అఖిల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించని రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. భాగ్యశ్రీ బోర్సె తన నటనతో పాటు గ్లామర్‌తో మెప్పించగా, ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Also Read :KVN Narayana: ఆయనతో చేద్దామని ఈయనతో చేశా కానీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన వెంకట్ కే.నారాయణ

సాంకేతికంగా కూడా 'లెనిన్' మంచి మార్కులు సాధించింది. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు కథను తెరకెక్కించిన తీరు, తమన్ అందించిన నేపథ్య సంగీతం, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు జీ5 ద్వారా ఇంట్లోనే చూసే అవకాశం రావడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే థియేటర్లలో మిస్ అయిన వారు, మరోసారి చూడాలనుకునే వారు ఆగస్టు 7 నుంచి ఈ సినిమాను జీ5లో వీక్షించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi