Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహేష్ కు జోడిగా రౌడీ హీరోయిన్..

మహేష్ కు జోడిగా రౌడీ హీరోయిన్..

పూరి- విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న ఫైటర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అనన్య పాండే కు తాజాగా మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఫైటర్ మూవీ సెట్స్ ఫై ఉండగానే , మహేష్ బాబు - పరుశురాం కలయికలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా అనన్య కు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే మహేష్ సరసన మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఓకే చేశారు దర్శకుడు పరశురామ్. అయితే, రెండో హీరోయిన్ పాత్ర కోసం అనన్యను సంప్రదిస్తున్నారట. మరి ఈ బాలీవుడ్ బ్యూటీ సెకండ్ హీరోయిన్‌గా చేయడానికి అంగీకరిస్తారో లేదో చూడాలని అంటున్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi