Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nagarjuna: సూర్య 49లో నాగ్.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!

Nagarjuna: తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'సూర్య 49'పై ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 'సూర్య 49' ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజం అయితే.. సూర్య, నాగార్జున కలిసి వెండి తెరపై కనిపించడం ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

Tollywood Theater Issue: చిన్న సినిమాల థియేటర్ల కేటాయింపుపై దర్శకుడి పోరాటం.. దిల్ రాజు, సురేష్ బాబుకు లీగల్ నోటీసులు!

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి వామికా గబ్బిని తీసుకునేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎంపిక కూడా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదట. గతంలో హెచ్. వినోద్ యాక్షన్, సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలను తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో సూర్యతో ఆయన చేయబోయే 'సూర్య 49'పై ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను సూర్య, జ్యోతికకు చెందిన ఝగరం స్టూడియోస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇక నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రం 'కింగ్ 100'పై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు సూర్య ఇప్పటికే తన 47వ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. హెచ్.వినోద్ ప్రాజెక్ట్ 2027లో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 'సూర్య 49'లో నాగార్జున నిజంగానే భాగమవుతారా? ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది.

Irumudi: ఉత్తర అమెరికాలో ఇరుముడి జోరు.. లక్ష టికెట్ల మైలురాయిని దాటిన మాస్ మహారాజా మూవీ!

----

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi