Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Raaka: రెండు భాగాలుగా 'రాకా'? ఈ ప్రచారంలో నిజం ఇదేనా!

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'రాకా'. ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి.

సినిమా బడ్జెట్, రిలీజ్ డేట్, స్టోరీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తుండగా, తాజాగా మరో సరికొత్త రూమర్ హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. 'రాకా'ను మేకర్స్ రెండు పార్ట్‌లు రిలీజ్ చేయబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్ నిర్మాతలు ఆశించిన స్థాయిలో జరగలేదని, అందువల్ల భారీ స్థాయిలో పెట్టున పెట్టుబడిని తిరిగి రాబట్టేందుకు ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

Also Read :Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడంటే!

అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందా? లేక ఒక్క పార్ట్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుందా? అనే విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. నిజానికి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'రాకా'పై ప్రతి చిన్న వార్త కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం 'రాకా' షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి మేకర్స్ త్వరలోనే కీలక అప్‌డేట్స్ ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi