Dailyhunt
రహానె భారీ విరాళం..

రహానె భారీ విరాళం..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. దీనిని అరికట్టేందుకు కేంద్రం లాక్ డౌన్ చేసింది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను మోడీ ప్రకటించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. దీంతో రోజు వారి కూలి చేసుకుని బ్రతికే వారికీ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సినీ , రాజకీయ నేతలు కేంద్రం , రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు తమవంతు విరాళాలు ప్రకటించగా ..క్రీడా రంగం నుండి కూడా భారీ విరాళాలు అందుతున్నాయి.

గౌతమ్ గంభీర్, ఎమ్ ఎస్ ధోని, పీవీ సింధు, సచిన్ టెండూల్కర్ సహా పలువురు క్రీడాకారులు విరాళాలు ప్రకటించారు.

ఆ జాబితాలో భారత టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అజింక్య రహానె చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ .10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi