Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు ఊహించిన స్థాయిలో స్పందన రాలేదా? వ్యూస్‌పై సోషల్ మీడియాలో రచ్చ!

Ramayana Trailer: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ'. తాజాగా ఈ సినిమా నుంచి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఈ ట్రైలర్ అందుకోలేకపోయిందని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. దీంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదిహాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 24 గంటల వ్యూస్ పరంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' ట్రైలర్ 113.2 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రికార్డును 'రామాయణ' ట్రైలర్ అధిగమించలేకపోవడం అభిమానులు, సినీ విశ్లేషకుల మధ్య చర్చకు కారణమైంది.

Also Read :Shine Screens: బాసిల్ జోసెఫ్ హీరోగా షైన్ స్క్రీన్స్ క్రేజీ ప్రాజెక్ట్!

అయితే ట్రైలర్ వ్యూస్‌ను మాత్రమే ఆధారంగా చేసుకుని సినిమా విజయాన్ని అంచనా వేయలేమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొంతమంది ప్రేక్షకులు ట్రైలర్ తమ అంచనాలను పూర్తిగా అందుకోలేదని సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. మేకర్స్ మాత్రం ట్రైలర్‌కు వస్తున్న స్పందనను సానుకూలంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం, కథపై చర్చ జరగడం కూడా ఒక రకంగా ప్రచారానికి ఉపయోగపడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ట్రైలర్ వ్యూస్ కేవలం ఒక ప్రమాణం మాత్రమేనని, అసలు విజయం మాత్రం సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్దే తేలనుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయడుతున్నారు. మరికొందరు ఈ ట్రైలర్ రెస్పా్న్స్ చూసిన తర్వాత అయిన మేకర్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారో లేదా అనే విషయంపై చర్చించుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi