రంగ్ దే ఫస్ట్ లుక్ కేక

రంగ్ దే ఫస్ట్ లుక్ కేక

తెలుగు మిర్చి

తెలుగు మిర్చి

2200d

Loading...

భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్..ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న సినిమాల ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడు. వాటిల్లో రంగ్ దే చిత్రం ఒకటి. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 'గిమ్మీ సమ్ లవ్' అనేది ట్యాగ్ లైన్.

నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర తాలూకా ఫస్ట్ లుక్ ను మార్చి 29 న రిలీజ్ చేసి ఆసక్తి నింపారు.

అను మరియు అర్జున్ అనే యంగ్ కపుల్ మధ్య జరిగే రొమాంటిక్, సెన్సిబుల్ లవ్ స్టోరీగా రంగ్ దే ఉంటుందని అర్థం అవుతుంది. మోషన్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్ర యూనిట్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi