Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

RC17: 'ఆర్‌సీ17'లో 'రంగస్థలం'ను మించే పాత్రలో రామ్ చరణ్?

RC17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం 'ఆర్‌సీ17' (వర్కింగ్ టైటిల్).

ఇప్పటి వరకు మొదలు కానీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకూ పెరిగి ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు రెడీ అవుతుందనే వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్‌సీ17 ను రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తారని గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఒకే పార్ట్‌లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Also Read :Nithiin: నితిన్‌తో 'దండోరా' డైరెక్టర్.. హాట్ టాపిక్ అదిరిపోయే అప్డేట్!

ఇటీవల వస్తున్న పాన్ ఇండియా చిత్రాల తరహాలో రెండు లేదా మూడు భాగాలుగా కాకుండా, పూర్తి కథను ఒకే సినిమాలో చెప్పేలా సుకుమార్ ఈ సినిమా స్క్రీన్‌ప్లేను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఆయన మార్క్ ట్విస్టులు, భావోద్వేగాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించనున్న పాత్ర ఆయన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రంగస్థలంలోని చిట్టిబాబు పాత్రను మించే స్థాయిలో ఈ క్యారెక్టర్‌ను సుకుమార్ డిజైన్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు శశ్వత్ సచ్‌దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో చిత్రానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi