Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ రెడ్డి మళ్ళీ దొరికాడా ?

రేవంత్ రెడ్డి మళ్ళీ దొరికాడా ?

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కలిసి తప్పుడు డాక్యుమెంట్లతో భూమి రాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో అత్యంత ఖరీదు చేసే ఐదెకరాల స్థలాన్ని అక్రమ మార్గంలో దక్కించుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.

తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్‌ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ విచారణలో బహిర్గతమైంది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్‌రెడ్డి అక్రమ మార్గంలో హస్తగతం చేసుకున్నారని నివేదిక వెల్లడించింది. రేవంత్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi