Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Rishab Shetty: 'కాంతార 2' ప్లాన్స్ లీక్.. కానీ ఆ రెండు సినిమాల తర్వాతే! ఫ్యాన్స్‌కి రిషబ్ శెట్టి క్రేజీ అప్‌డేట్..

Rishab Shetty: 'కాంతార' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు.

కేవలం తాను నమ్మి తెరకెక్కించిన కంటెంట్‌తో ఇండియా లెవల్‌లో హిట్ కొట్టిన రిషబ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ మూవీగా మారుతున్న 'కాంతార చాప్టర్ 2' (Kantara Chapter 2) పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. "నేను దర్శకత్వానికి దూరంగా ఉండలేను. డైరెక్షన్ చేస్తున్నప్పుడే నాకు మానసిక ప్రశాంతత, నిజమైన సంతోషం లభిస్తాయి. నా రైటర్స్ టీమ్‌తో కలిసి నేను ఇప్పటికే 'కాంతార చాప్టర్ 2' స్క్రిప్ట్ పనులపై కసరత్తులు మొదలుపెట్టాను" అని పేర్కొన్నారు.

Also Read :Aamir Khan: 131 మంది కలిసి చేసిన రేర్ రింగ్.. అమీర్ ఖాన్ తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ చూశారా!

అయితే, ఈ సినిమా కంటే ముందే ఆయన నటుడిగా ఒప్పుకున్న రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. తనకు ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేయడం అస్సలు ఇష్టం ఉండదని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు. "నాకు బ్యాక్-టు-బ్యాక్ రెండు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న 'జై హనుమాన్' చిత్రాన్ని నేను ముందుగా పూర్తి చేస్తాను. ఆ తర్వాతే 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను. ఈ రెండు సినిమాల్లో నా పాత్రల కోసం పూర్తిగా భిన్నమైన శారీరక లుక్స్ మెయింటైన్ చేయాల్సి ఉంది. అందుకే ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాను టేకాఫ్ చేస్తాను" అని ఆయన వివరించారు. 'కాంతార చాప్టర్ 2' స్క్రిప్ట్ వర్క్ సమాంతరంగా జరుగుతున్నప్పటికీ, ఈ రెండు నటన ప్రాధాన్యత ఉన్న పాత్రల శారీరక శ్రమ దృష్ట్యా షెడ్యూల్స్ ఓవర్‌లాప్ కాకుండా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. బెంగళూరులో ఒక భారీ ఫిల్మ్ సిటీ నిర్మించాలనే చర్చల గురించి ప్రస్తావిస్తూ రిషబ్ శెట్టి తన స్వగ్రామమైన 'కెరాడి' గురించి మాట్లాడారు. 'కాంతార మొదటి భాగం' షూటింగ్ మెజారిటీ శాతం ఇక్కడే జరిగిందని వెల్లడించారు. తన సొంత ఊరైన కెరాడిని ఒక 'సినిమా విలేజ్'గా మార్చడానికి తాను స్వయంగా ప్రయత్నించానని, అందుకే ప్రేమగా తన ఊరిని 'KFC' అని పిలుచుకుంటానని రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi