Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Sarpatta 2: 'సర్పట్టా 2'పై అదిరిపోయే అప్‌డేట్.. ఈసారి పక్కా థియేటర్లలోనే!

Sarpatta 2: భాషలకు అతీతంగా సినీ అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిత్రం 'సర్పట్టా పరంబరై'. తాజాగా ఈ చిత్రం సీక్వెల్‌పై మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు.

పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న 'సర్పట్టా 2'పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఈ సినిమాలో నటిస్తున్న దుషారా విజయన్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'సర్పట్టా 2' షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ సినిమా ప్రీక్వెల్‌గా తెరకెక్కనున్నట్లు పేర్కొన్నారు. ఫస్ట్‌ పార్ట్‌లో చూపించిన కథకు ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందని ఆమె వెల్లడించారు. ఇక 'సర్పట్టా పరంబరై' చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే 'సర్పట్టా 2' మాత్రం కచ్చితంగా థియేటర్లలోనే విడుదల అవుతుందని దుషారా విజయన్ స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, భారీ అంచనాలు పెట్టుకున్నానని తెలిపారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన 'సర్పట్టా పరంబరై' తమిళ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కథనం, నటీనటుల ప్రదర్శన, పా.రంజిత్ దర్శకత్వానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఇప్పుడు 'సర్పట్టా 2'లో కథ ఎలా ఉండబోతుంది? పాత పాత్రలతో పాటు కొత్తగా ఎలాంటి అంశాలను చూపించబోతున్నారు? అనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi