Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Shah Rukh: 'కింగ్'కు భారీ క్రేజ్.. ఆడియో రైట్స్‌తోనే రికార్డు స్థాయి బిజినెస్!

Shah Rukh: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోను ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా భారీ సంచలనాలు నమోదవుతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. 'కింగ్' సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ సంస్థలు పోటీ పడీ మరి దక్కించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ.50 కోట్లకు చేరువలో ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.

Also Read :Viswanath And Sons: 'విశ్వనాథ్ అండ్ సన్స్' వెనుక స్టార్ హీరో భార్య.. వెంకీ అట్లూరి ఆసక్తికర కామెంట్స్

ఈ మొత్తం షారుక్ ఖాన్ గత చిత్రాల రికార్డులను అధిగమించినట్లు తెలుస్తోంది. 'పఠాన్' మ్యూజిక్ రైట్స్ రూ.30 కోట్ల వరకు ఉండగా, 'జవాన్' ఆడియో హక్కులు సుమారు రూ.36 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పుడు 'కింగ్' వాటిని దాటి కొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతుంది ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సచిన్ - జిగర్ ద్వయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై షారుక్ ఖాన్ మార్కెట్, పాన్ ఇండియా క్రేజ్ కారణంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యూజిక్ రైట్స్ ద్వారా వస్తున్న ఆదాయం సినిమా బడ్జెట్‌లో కీలక భాగాన్ని కవర్ చేసే స్థాయిలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. షారుక్ ఖాన్ స్టార్ పవర్, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్, భారీ స్థాయి యాక్షన్ ఎలిమెంట్స్‌తో 'కింగ్'పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిందని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi