Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Sharwanand: శ్రీను వైట్ల - శర్వా మూవీలో 'కన్నప్ప' బ్యూటీ.. రిలీజ్ అప్పుడేనట!

Sharwanand: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవల 'నారి నారి నడుమ మురారి', 'బైకర్' సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

టెంపరరీగా 'జార్జ్ క్రిష్' అని పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో శర్వానంద్ సరసన నటించే హీరోయిన్‌ను మేకర్స్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. 'కన్నప్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవ అయిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ఈ చిత్రంలో లీడింగ్ లేడీగా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీను వైట్ల మార్క్ కామెడీ, రొమాన్స్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా ఈమె క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శర్వానంద్, సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' (Bhogi) అనే మాస్ యాక్షన్ పీరియడ్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే, ఆగస్ట్ నెల నుంచి శ్రీను వైట్ల సినిమా షూటింగ్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.

Also Read :Bhogi: రిస్కీ స్టంట్స్‌తో రెచ్చిపోతున్న శర్వానంద్! 'భోగి' నుంచి క్రేజీ అప్డేట్..

శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే వింటేజ్ కామెడీ, అదిరిపోయే క్యారెక్టరైజేషన్లు ఈ చిత్రంలో మళ్లీ చూడబోతున్నామని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ అనేది బాగా కలిసొచ్చిన సెంటిమెంట్. 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా' లతో పాటు లేటెస్ట్ హిట్ నారి నారి నడుమ మురారి కూడా సంక్రాంతికే వచ్చాయి. అందుకే శ్రీను వైట్ల మార్క్ 'జార్జ్ క్రిష్' చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి 2027 బరిలో దించడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi