Dailyhunt
శోకసంద్రంలో సుకుమార్ ..

శోకసంద్రంలో సుకుమార్ ..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ శోకసంద్రం లో మునిగిపోయాడు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ గుండెపోటు తో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సుకుమార్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రసాద్‌ 'అమరం అఖిలం ప్రేమ' అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.

సుకుమార్ కు ఎప్పుడు నిరాశ కలిగిన ప్రసాద్ తో మాట్లాడితే చాలు ఆయనకు అదంతా దూరం అయిపోయేదని అంతలా ప్రసాద్ తన జీవితం పై ప్రభావం చూపించాడని సుకుమార్ చాలాసార్లు తెలియజేసారు.

సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ఈ ప్రసాద్ ఒకరు. అయితే ఆయన మరణం తనకి తీరని లోటని, ప్రసాద్ లేని లోటును తన జీవితం లో ఎవరు భర్తీ చేయలేరని సుకుమార్ తెలిపారు.

ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తికాగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది .

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi