Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

The Paradise: నాని 'ది ప్యారడైజ్' చిత్రానికి కొత్త తిప్పలు.. షూటింగ్ కంటే అదే పెద్ద తలనొప్పిగా మారిందా?

The Paradise: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ - ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో 'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై సినీ ప్రేమికుల్లో, నాని ఫ్యాన్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక సరికొత్త ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రయూనిట్‌కు షూటింగ్ పూర్తి చేయడం కంటే, ఒక సరైన 'రిలీజ్ డేట్'ను లాక్ చేయడమే అతిపెద్ద సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది.

ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రేస్‌లో నిలపాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది కాస్త అనుమానంగానే కనిపిస్తోంది. అటు అక్టోబర్, ఇటు డిసెంబర్ నెలల్లో ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు క్యూ కట్టాయి. పండగ సీజన్లు, ఇయర్-ఎండ్ వీకెండ్స్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద సినిమాలు వస్తుండటంతో.. బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి టైమ్‌లో పాన్ - ఇండియా వైడ్‌గా థియేటర్లను భారీ సంఖ్యలో దక్కించుకోవడం అంత సులువు కాదు. ఈ క్రమంలో మేకర్స్ ముందు 'నవంబర్' నెల మాత్రమే అత్యంత సేఫ్ ఆప్షన్‌గా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్‌లో పెద్ద సినిమాల సందడి కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, నానికి ఇక్కడ 'సోలో రిలీజ్' దొరికే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే, వసూళ్ల పరంగా 'ది ప్యారడైజ్' చిత్రానికి అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేసి, హిందీతో పాటు మిగతా భాషల్లోనూ పర్ఫెక్ట్ విండోను ఫిక్స్ చేయడంపైనే ఇప్పుడు మేకర్స్ కసరత్తులు చేస్తున్నారట. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌పై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi