Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Tollywood Couple: టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట.. అధికారికంగా ప్రకటించిన కాలభైరవ, కావ్య కళ్యాణ్‌రామ్!

Tollywood Couple: టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ, హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ తాము ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు తాజా ప్రకటనతో తెరపడింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుమారుడైన కాలభైరవ.. కావ్య కళ్యాణ్‌రామ్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమెను తన జీవితంలోకి వచ్చిన ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన సాధారణ రోజులను కూడా ఆనందంగా మార్చినందుకు కావ్యకు ధన్యవాదాలు చెబుతూ.. ఆమె తనకు 'హోమ్' లాంటిదని పేర్కొన్నారు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తన పోస్టులో వెల్లడించారు.

Prithviraj Sukumaran: మహేశ్ సినిమా కోసం 'దాయరా'ను వదులుకోవాలనుకున్న పృథ్వీరాజ్.. కానీ కరీనా కోసం యూ-టర్న్!

మరోవైపు కావ్య కళ్యాణ్‌రామ్ కూడా కాలభైరవతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఐ ఫౌండ్ మై ఎల్లో పేపర్ డైసీ" అంటూ తన ప్రేమను క్యూట్‌గా వ్యక్తపరిచారు. సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుందని చెబుతూ.. కాలభైరవ తన రోజులను ఎంతో ప్రత్యేకంగా మార్చారని రాసుకొచ్చారు. అంతేకాదు, తాను వద్దని చెప్పినా తనకు డైట్ కోక్ కావాలని గుర్తుపెట్టుకునేంతగా తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికినందుకు ఆనందంగా ఉందంటూ సరదాగా పేర్కొన్నారు. కాగా, కావ్య కళ్యాణ్‌రామ్ 'మసూద', 'బలగం', ఉస్తాద్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కాలభైరవ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తాజాగా అధికారికం కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi