Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Toxic Trailer: 'టాక్సిక్' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. బెంగళూరులో గ్రాండ్ లాంచ్!

Toxic Trailer: రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఆగస్టు 8న బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు చిత్ర బృందంతో పాటు సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యష్, 'టాక్సిక్'తో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :Rana Daggubati: 'జై హనుమాన్'లో హై వోల్టేజ్ వార్? రిషబ్ శెట్టి vs రానా!

ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా కథ, యష్ పాత్ర, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆగస్టు 8న విడుదల కానున్న ట్రైలర్ అభిమానులకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతుందో చూడాల్సి ఉంది. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi