Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

T-Works వేదికగా 'ZenC Labs' ఆవిర్భావం.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

ZenC Labs: హైదరాబాద్ నగరంలోని T-Works ప్రాంగణంలో ప్రముఖ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ 'ZenC Labs'ను శనివారం ఘనంగా ప్రారంభించారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాచార సాంకేతిక రంగంలో సైబర్ బెదిరింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల ప్రాధాన్యత మరింత పెరుగుతోందన్నారు. సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మరింత అభివృద్ధి చేయడంలో పరిశోధన ఆధారిత స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని ఎంపీ ఆకాంక్షించారు. కొత్త ఆలోచనలు, అధునాతన టెక్నాలజీతో పనిచేసే సంస్థలకు హైదరాబాద్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో ZenC Labs ను ఏర్పాటు చేసిన సంస్థ ఫౌండర్, సీఈఓ రవి పుత్తాతో పాటు ఆయన బృందాన్ని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ZenC Labs చీఫ్ మెంటార్ మురళి తలసిల, అరబిందో ఫార్మా గ్రూప్ CIO చిట్టి బాబు, వాల్యూమోమెంటమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ZenC Labs బృందానికి అభినందనలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi