Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైరల్ : సెక్సీ లుక్స్ తో బీస్ట్ బాయ్.

వైరల్ : సెక్సీ లుక్స్ తో బీస్ట్ బాయ్.

విజయ్ దేవరకొండ స్టార్డం రోజు రోజుకు పెరుగుతుంది. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్..తనదైన స్టయిల్ తో ఇతర భాషల అభిమానులను సైతం సొంతం చేసుకున్నాడు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డు కొట్టిన విజయ్ ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు. దేశంలో టాప్ ఫోటోగ్రాఫర్స్ లో ఒకరైన డాబూ రత్తాని సినీతారలకు స్టైలిష్ ఫోటోషూట్స్ చేస్తుంటాడు. తాజాగా డాబూ రత్తాని ఫోటోగ్రఫీ లో విజయ్ దేవరకొండ ట్రైయంఫ్ బైక్ పై సెక్సీ లుక్స్ తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫోటో లో విజయ్ దుమ్ముపట్టిన బనీన్ తో బైక్ పై కూర్చొని ఉన్న ఈ ఫోటోకి బీస్ట్ బాయ్ అని టాగ్ చేసారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై మరొక పాన్ ఇండియా మూవీలో నటించనున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi