తెలుగు లో పలు సినిమాలతో ఆకట్టుకున్న అమలా పాల్..డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విడాకుల్ వ్యవహారం జరిగి రెండేళ్లు అవుతున్న తాజాగా ఈ వ్యవహారం బయటకు వచ్చి వార్తల్లో నిలిచింది. వీరిద్దరి విడాకులకు హీరో ధనుష్ కారణమనే ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది.
విజయ్ తండ్రి, నిర్మాత ఏఎల్.అళగప్పన్ తన కుమారుడు విజయ్ విడాకులు తీసుకోవడానికి నటుడు ధనుష్ కారణం అంటూ ఆయన తెలిపారు. తాను నిర్మించిన 'అమ్మ కణక్కు' చిత్రంలో నటించమని అమలాపాల్‌ను ఆయన కోరాడని చెప్పాడు. దీంతో, పెళ్లి జరిగాక నటించనని చెప్పిన అమలాపాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైన నేపథ్యంలో అమలాపాల్, విజయ్‌కు మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు.
ఎప్పుడో జరిగిన విషయంపై ఇప్పుడు అడుగుతున్నారేంటని ప్రశ్నించింది. విడాకులపై ఇప్పుడు చర్చ అనవసరమని తెలిపింది. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని తెలిపింది. అందుకు ఇతరులెవరూ బాధ్యులు కారని చెప్పింది. అసలు ఇతరుల కారణంగా ఎవరైనా వివాహాన్ని రద్దు చేసుకుంటారా? ప్రశ్నించింది.

