Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Vishal: 'మకుటం'లో మూడు విభిన్న రోల్స్.. అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఉంటాయి!

Vishal: తమిళ హీరో విశాల్ నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'మకుటం' (Makutam) పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఈ సినిమా గురించి పలు అప్‌డేట్స్ వైరల్ అవుతుండగా, తాజాగా విశాల్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మకుటం (Makutam) సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉంటాయని వెల్లడించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో తాను మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు చెప్పారు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన లుక్, బాడీ లాంగ్వేజ్ ఉంటుందని, వాటిని ఎంతో శ్రద్ధగా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ఒక పాత్రలో ఆయన మధ్యతరగతి కుటుంబానికి చెందిన మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా కనిపించనున్నట్లు చెప్పారు.

Also Read :Ravi Teja: మాస్ మహారాజాతో మలయాళ బ్యూటీ రొమాన్స్..

అలాగే మరో పాత్రలో గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తినట్లు, ఇంకో పాత్రలో లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు వీరాభిమానిగా కనిపించనబోతున్నట్లు వెల్లడించారు. ఈ మూడు పాత్రలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని అన్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటుడిగా కెమెరా ముందు నిలబడటమే కాకుండా, దర్శకుడిగా కెమెరా వెనుక కూడా పూర్తి బాధ్యతలు నిర్వర్తించడం పెద్ద సవాల్‌గా అనిపించిందని విశాల్ చెప్పారు. ఒకేసారి రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం అంత సులభం కాదని, అయితే సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు తన శక్తిమేర కృషి చేశానని వెల్లడించారు. మూడు విభిన్న పాత్రలు, విశాల్ డైరెక్షన్, స్టోరీలోని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ కలిసి 'మకుటం' (Makutam) పై భారీ అంచనాలను నెలకొల్పాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi