Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Yash-Lokesh: యశ్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా? 'రాకా' ఆలస్యంతో మారిన లోకేష్ ప్లాన్!

Yash-Lokesh: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలపై సాధారణంగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన యాక్షన్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ఆయన ఇటీవల 'డీసీ' చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు.

హీరోగా ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే సక్సెస్‌ను కొట్టిన ఆయన ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజాగా ఆయన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నడ స్టార్ హీరో యశ్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం వినిపిస్తోంది.

వాస్తవానికి అల్లు అర్జున్‌తో లోకేష్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. 'AA23'గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'రాకా' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బన్నీ లోకేష్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలు గతంలో వచ్చాయి. అయితే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' భారీ స్థాయి నిర్మాణం, విస్తృతమైన షూటింగ్, వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అల్లు అర్జున్ లోకేష్ ప్రాజెక్ట్‌కు వెంటనే డేట్స్ కేటాయించే పరిస్థితి లేకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ తన షెడ్యూల్‌ను ఖాళీగా ఉంచకుండా మరో హీరోతో సినిమా చేయాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. అందులో భాగంగానే తాజాగా యశ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ - యశ్ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమాపై యశ్ అభిమానులతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. ముఖ్యంగా లోకేష్ మార్క్ యాక్షన్‌కి, యశ్ మాస్ ఇమేజ్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే యశ్‌తో లోకేష్ సినిమా విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. దీంతో ప్రస్తుతం యశ్ ప్రాజెక్ట్ నిజమా? లేక కేవలం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మాత్రమేనా? అనేది ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi