సినిమా వార్తలు
ఆస్కార్ రేసులో.. ఆకాశమే నీ హద్దురా !

సుధా కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం 'సూరారై పొట్రు'. తెలుగులో 'ఆకాశమే నీ హద్దురా' పేరుతో రిలీజైంది. మంచి సినిమా అనిపించుకుంది. ఇప్ప్పుడీ.. ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉన్నది. జనరల్ క్యాటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు పోటీపడుతోంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరక్టర్ తో పాటు మరికొన్ని కేటగిరీల్లో ఈ సినిమా పోటీపడనున్నది.
ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా సినిమాను రూపొందించారు. సూర్య కీలక పాత్ర పోషించారు. అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్ దీంట్లో నటించారు. సూరారై పొట్రు సినిమా ఆస్కార్ రేసుకు ఎంట్రీ అయినట్లు ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ కోసం.. ఆస్కార్స్‌లో జనరల్ క్యాటగిరీలో పోటీపడనున్నట్లు పాండియన్ తెలిపారు.
related stories
-
హోమ్ ఆస్కార్ బరిలో 'ఆకాశం నీ హద్దురా'
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్
-
హోమ్ ఆస్కార్ రేసులో సూర్య సినిమా