Saturday, 25 Sep, 6.22 pm TeluguStop.com

తాజా వార్తలు
గొయ్యిలో దాక్కున్న అడవి పందిని బయటకు లాగి మరి.. చిరుత వేటా.. మజాకా..

అడవిలో ఉండే క్రూర జంతువుల వేట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రూర జంతువులు భీకర పోరు జరిపి తమ ఆహారాన్ని తామే ఏర్పాటు చేసుకుంటాయి. ఇక సాధు జంతువులు అయితే ఈ క్రూర జంతువుల కంట పడకుండా తమ జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటాయి. ఒకసారి వాటి కంటపడితే ఇక అంతే సంగతులు.. తమ ప్రాణాలు పోతాయంతే.. క్రూర జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా చిరుత వేటకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా నెట్టింట జంతువులకు సంబంధించిన యూనిక్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ క్షణాల్లోనే ట్రెండ్ అవుతుంటాయి. ఇక క్రూర జంతువుల భీకర పోరాటాల వీడియో అయితే చాలు. అందరు వాటిని చూసి వైరల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే సింహం, పులి, చిరుత వేట వీడియోలు బోలెడు వైరల్ కాగా, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో చిరుత క్షణాల్లోనే అడవి పందిని మట్టుబెట్టింది. ఎరను ఎంచుకున్నాక క్షణాల్లోనే అటాక్ చేసి తన సత్తా ఏంటో చూపించింది చిరుత. సహజంగానే చిరుత వేట చాలా భయానకంగా ఉంటుంది. ఇక ఈ చిరుత ఈ సారి చాలా ఆకలి మీద ఉన్నట్లుంది. దండయాత్ర చేసిన మాదిరిగానే క్షణాల్లోనే గొయ్యిలో దాక్కున్న అడవి పందిని బయటకు లాగి మరీ చంపేసింది.

వైరల్ అవుతున్న సదరు వీడియో చూస్తే మీకు చిరుత వేట ఎంత భీకరంగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. అయితే, ఒకసారి జంతువును వేటాడాలని చిరుత డిసైడ్ అయిందంటే చాలు..కాన్సంట్రేషన్ మొత్తం దానిపైనే చేసి దానని తుదముట్టించగలదు. అలా లక్ష్యాన్ని ఇట్టే చేరుకునే వేగం చిరుతకు ఉంది. చిరుత వేట నుంచి తప్పించుకునేందుకుగాను సాధు జంతువులు ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ, ఎప్పుడో ఒకసారి రేర్‌గా మాత్రమే చిరుత ఎర నుంచి సాధు జంతువులు తప్పించుకోగలవు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: TeluguStop.com
Top