*పోలీస్–మీడియా సత్సంబంధాలకు వేదికగా ‘సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026’ ప్రారంభం*
*టోర్నమెంట్‌ను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, ఐపీఎస్.,*
CYBERABAD MEDIA NEWS : పోలీస్–మీడియా మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న *“సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026”* టోర్నమెంట్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ *డా. ఎం. రమేష్, ఐపీఎస్.,* ఈ రోజు సైబరాబాద్ సీపీ కార్యాలయ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా ప్రారంభించారు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అదనపు డీసీపీ షమీర్ ఆధ్వర్యంలో జూన్ 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.

పోలీసు అధికారులు, సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులతో కూడిన జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.
టోర్నమెంట్ తొలి రోజు జరిగిన మ్యాచ్‌లలో మల్కాజిగిరి మీడియా థండర్స్ జట్టు కెప్టెన్ వంశీ నాయకత్వంలో క్రైమ్ పార్ట్నర్స్ జట్టుతో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మల్కాజిగిరి మీడియా థండర్స్ జట్టు విజయం సాధించగా, అద్భుత ప్రదర్శన కనబర్చిన జెస్తాది రాజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.

మరో మ్యాచ్‌లో ఎస్‌సీఎస్‌సీ డిఫెండర్స్ జట్టు కెప్టెన్ ప్రణవ్ నాయకత్వంలో, శేరిలింగంపల్లి జట్టు కెప్టెన్ ఖాదిర్ నాయకత్వంలోని జట్టుతో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌సీఎస్‌సీ డిఫెండర్స్ జట్టు విజయం సాధించగా, అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన శివ కుమార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
*ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ* పోలీసు శాఖ మరియు మీడియా ప్రతినిధుల మధ్య పరస్పర అవగాహన, సమన్వయం, స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
*“యునైటెడ్ ఇన్ స్పిరిట్ – స్ట్రాంగర్ టుగెదర్”* అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11న సాయంత్రం జరగనుంది.