మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం – యువతి మృతి
2026 ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో భారతి ముఖి (26) అనే యువతి మృతి చెందింది. ఆమె ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. సంఘటన జరిగిన రోజు భారతి ముఖి తన సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనం తీసుకురావడానికి వెళ్లింది. అనంతరం ఇనార్బిట్ మాల్ వైపు తిరిగి వస్తుండగా, మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న సమయంలో TG-09-G-0666 నంబర్ గల కారు వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి భారతి ముఖిని ఢీకొట్టింది.

ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర రక్తస్రావ గాయం కావడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1238/2026ను BNS సెక్షన్ 106(1) కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో ప్రమాద సమయంలో కారును నడిపిన వ్యక్తిగా లింగమనేని సంజుష్, తండ్రి లింగమనేని రమేష్, వయస్సు 21 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం: హైటెక్ సిటీ, మాదాపూర్ను పోలీసులు గుర్తించారు. అదే రోజు అతడిని అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షతో పాటు డ్రగ్ పరీక్ష నిర్వహించారు. అలాగే రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కి పరీక్షల కోసం పంపించారు.
ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం PME (Post-Mortem Examination) నివేదికతో పాటు ఇతర ఆధారాల సేకరణపై దర్యాప్తు కొనసాగుతోంది.
*కె.వి. సుబ్బారావు,*
*PH: 8712663100*
*SHO, మాదాపూర్ పోలీస్*