Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ కస్టమర్లకు డబుల్ ధమాకా.. 28 రోజుల వ్యాలిడిటీ, ఒక్క రీఛార్జ్‌తో 15 OTT యాప్‌లు!

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ కస్టమర్లకు డబుల్ ధమాకా.. 28 రోజుల వ్యాలిడిటీ, ఒక్క రీఛార్జ్‌తో 15 OTT యాప్‌లు!

10tv 6 days ago
  • ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు పండగే
  • కొత్త రూ.200 రీఛార్జ్ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ
  • 30GB హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..

అతి చౌకైన ధరకే ఎయిర్‌టెల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ. 200 రీఛార్జ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్ ద్వారా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.

అన్ లిమిటెడ్ 5జీ డేటా కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్లాన్ ద్వారా అదనపు డేటా, ప్రీమియం ఓటీటీ (Airtel Recharge Plan) కంటెంట్‌కు యాక్సెస్ కోరుకునే కస్టమర్లకు అద్భుతంగా ఉంటుంది. పూర్తి ప్లాన్, డేటా బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఎయిర్‌టెల్ 200 ప్లాన్ బెనిఫిట్స్ :
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, 30GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. కంపెనీ అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా అందిస్తోంది. మీరు కంపెనీ 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో ఉండి 5జీ స్మార్ట్‌ఫోన్‌ వాడుతుంటే.. మీ ప్రస్తుత ప్లాన్‌లో డేటా అయిపోయాక కూడా ఈ డేటాను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ రిలయన్స్ జియో రూ. 200 ఓటీటీ పాస్‌కు గట్టి పోటీ ఇస్తుంది.

జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ :
రూ. 200 ప్లాన్‌ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతోపాటు రూ. 149 వాల్యూ జియో హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీగా లభిస్తుంది. తద్వారా మీ మొబైల్ ఫోన్లలో లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, హాట్‌స్టార్ స్పెషల్స్, ఇతర కంటెంట్‌ను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. తద్వారా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్లాట్‌ఫామ్‌పై లయన్స్‌గేట్ ప్లే, సోనీ లివ్, ఆహా ప్రీమియం, చౌపాల్, సన్‌నెక్స్ట్ సహా 18కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

డేటా దాటితే ఛార్జ్ ఎంత? :
ప్లాన్ వివరాల ప్రకారం.. 30GB కోటా దాటితే డేటా వాడకంపై ప్రతి MBకి 50 పైసల ఛార్జీ పడుతుంది. డేటాను పెంచుకోవాలంటే సింగిల్ రీఛార్జ్‌తో ఓటీటీ స్ట్రీమింగ్‌ యాక్సెస్ పొందవచ్చు. ప్రీపెయిడ్ యూజర్లు అయితే ఈ యాడ్-ఆన్ అనేది అదనపు రీఛార్జ్‌ ఆప్షన్.

జియో రూ. 200 ప్లాన్ :
జియో రూ. 200 ఓటీటీ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ, 30GB డేటాతో వస్తుంది. ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్, యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ యాక్సెస్ పొందవచ్చు. అంతేకాదు.. ఈ ప్లాన్ తీసుకుంటే మొత్తం 16 ఓటీటీ యాప్‌లకు యాక్సస్ లభిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv