Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Akshay Lagusani : 'జగమే సంగీతం' వెబ్ సిరీస్.. రుద్రవీణ గుర్తొచ్చింది అంటున్న నటుడు..

Akshay Lagusani : 'జగమే సంగీతం' వెబ్ సిరీస్.. రుద్రవీణ గుర్తొచ్చింది అంటున్న నటుడు..

10tv 2 weeks ago

Akshay Lagusani : గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో కుమారి 21F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ జగమే సంగీతం.

కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే ఎనిమిది ఎపిసోడ్‌ల మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి.. మెయిన్ లీడ్స్ లో సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, కేశవ్ దీపక్, ప్రియాంక నల్కరి, మాణిక్ రెడ్డి, ప్రాచీ థాకర్, రూపా లక్ష్మి.. పలువురు కీలక పాత్రలలో నటించారు. జగమే సంగీతం సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంతో పాటు మిగతా ఆదేశాల్లో కూడా తెలుగు, తమిళ్ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులోకి

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటుడు అక్షయ్ లగుసాని నేడు మీడియాతో మాట్లాడారు. డెడ్ పిక్సెల్స్, కుమారి శ్రీమతి, హాస్టల్ డేస్.. లాంటి పలు వెబ్ సిరీస్‌లతో మెప్పించిన అక్షయ్ లగుసాని ఇప్పుడు జగమే సంగీతం సిరీస్‌లో బాలు పాత్రలో కనిపించనున్నారు.

బాలు పాత్ర గురించి అక్షయ్ మాట్లాడుతూ.. నాకు ఈ పాత్ర కోసం కాల్ వచ్చిన వెంటనే రుద్రవీణ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమా వినైల్ రికార్డు నా దగ్గర ఉంది. దాన్ని పాత బాక్స్ నుంచి తీసి బాలు పాత్రకు సిద్ధమవుతున్న సమయంలో నా టేబుల్‌పై పెట్టుకున్నాను. జగమే సంగీతంలో క్లాసికల్, మోడ్రన్ మ్యూజిక్ రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేశారు. చిరంజీవి గారు మా సెట్స్‌కు వచ్చారు. రుద్రవీణ నాకు ఎంతో ఇష్టమైన సినిమా కావడం, నాకు అలాంటి మ్యూజికల్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం.. ఇదంతా ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్‌లా అనిపించింది. సినిమాలో ప్రకాశ్ రాజ్ గారు నాకు తాతగా కనిపించనున్నారు. షూట్ గ్యాప్ లో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. బాలు తన తాతను ఎంత గౌరవంగా చూస్తాడో నేను కూడా ప్రకాశ్ రాజ్ సర్‌ను అదే భావంతో చూడాలని అనుకున్నాను. ఆయనను నా తాతగా భావించడం మొదలుపెట్టాను అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv