Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Allu Arjun: Lokesh: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. బన్నీ బర్త్ డే రోజున ఇంట్రెస్టింగ్ పోస్ట్

Allu Arjun: Lokesh: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. బన్నీ బర్త్ డే రోజున ఇంట్రెస్టింగ్ పోస్ట్

10tv 7 months ago
  • అల్లు అర్జున్- లోకేష్ కాంబోలో మూవీ
  • ఇప్పటికే వచ్చిన అధికారిక ప్రకటన
  • బన్నీ బర్త్ డే రోజున స్పెషల్ పోస్ట్ పెట్టిన లోకేష్

Allu Arjun: Lokesh: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రానున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) క్రేజ్ దృష్ట్యా, అల్లు అర్జున్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి అటు బన్నీ అభిమానులు, ఇటు లోకేష్ అభిమానులు షూటింగ్ అప్‌డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Adivi Sesh: డైరెక్టర్ కృష్ణవంశీతో మూవీ.. నా యాక్టింగ్ నచ్చలేదని తీసేశారు.. సగం షూటింగ్ అయ్యాక

తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజును లోకేష్ కనగరాజ్(Allu Arjun: Lokesh) సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. "నా హీరో అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీతో కలిసి చేస్తున్న AA23, LK7 ప్రయాణం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను సార్. షూటింగ్ ప్రారంభించి, మన ఇద్దరికీ ఇది ఒక మరువలేని అనుభవంగా మార్చడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ను తన హీరోగా సంబోధిస్తూ లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ పోస్ట్ ద్వారా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం 'రాక' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అంచనాలు పెంచేసింది. 2027లో ఈ రాక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుంది అనేది చూడాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv