Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amazon : ట్రంప్ చేసిన పని.. 'మా డబ్బులెప్పుడిస్తావ్..?' అమెజాన్ మీద కేసులేస్తున్న జనం..

Amazon : ట్రంప్ చేసిన పని.. 'మా డబ్బులెప్పుడిస్తావ్..?' అమెజాన్ మీద కేసులేస్తున్న జనం..

10tv 1 week ago

Amazon : అమెజాన్ మీద ప్రజలు కేసులు వేస్తున్నారు. తమ డబ్బులు తమకు ఎప్పుడు చెల్లిస్తావంటూ వాళ్లు ఈ కామర్స్ దిగ్గజాన్ని కోర్టుకు లాగుతున్నారు. అయితే, ఇదంతా ట్రంప్ చేసిన ఘనకార్యం వల్ల కావడం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ మధ్య కాలంలో విపరీతమైన టారిఫ్ లు విధించాడు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద 50శాతం, 70శాతం, 100శాతం అంటూ నోటికొచ్చినట్టు టారిఫ్‌లు విధించాడు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన వెంటనే ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద అమెజాన్ కూడా భారీగా రేట్లు పెంచేసి జనాలకు అమ్మేసింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ల ట్రంప్ కి అక్కడి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు ఇలా టారిఫ్‌లు పెంచడం కుదరదని స్పష్టం చేసింది. ట్రంప్ తెచ్చిన టారిఫ్‌లు సరికాదని కొట్టేసింది. అప్పటికే వసూలు చేసిన టారిఫ్ లు కూడా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇక్కడే అమెజాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. టారిఫ్‌లు పెంచినప్పుడు వసూలు చేసిన డబ్బులు మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వెనక్కి తిరిగి చెల్లించాలి. కానీ, జెఫ్ బిజోస్ మాత్రం ట్రంప్ మెప్పు కోసం ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా నాటకాలు చేస్తున్నాడు. దీంతో జనాలు చూసి చూసి విసిగిపోయి కోర్టులో కేసులు వేయడం స్టార్ట్ చేశారు. బిలియన్ల డాలర్ల సొమ్ము అమెజాన్ వసూలు చేసిందని.. ఆ డబ్బులు ఇప్పుడు వెనక్కి ఇవ్వడానికి సాకులు చెబుతోందని ఆరోపిస్తున్నారు.

ఒక్క అమెజాన్‌కే కాదు. ఇతర పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. కాస్ట్ కో, నైకీ, ఫెడెక్స్ లాంటి సంస్థల మీద కూడా చాలా మంది కేసులు వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్ లను అడ్డం పెట్టుకుని వసూలు చేసిన ఎక్స్ ట్రా డబ్బులు కక్కాల్సిందేనని కోర్టుల్లో వాదిస్తున్నారు. దీంతో ఆయా కంపెనీలకు తలనొప్పిగా మారింది. ఎవరెవరి నుంచి ఎంతెంత వసూలు చేశారనే డేటాతో పాటు వారికి సంబంధించిన బ్యాకింగ్ డిటెయిల్స్, దీనికి తోడు లీగల్ ఇష్యూస్ అన్నీ కలిపి కంపెనీలకు తలనొప్పిగా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv