Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Annapurna Studios : అన్నపూర్ణ'లో సినిమా చేయాలంటే.. నాగార్జునతో పాటు వాళ్లందరికీ కథ నచ్చాల్సిందే.. హీరో కామెంట్స్ వైరల్..

Annapurna Studios : అన్నపూర్ణ'లో సినిమా చేయాలంటే.. నాగార్జునతో పాటు వాళ్లందరికీ కథ నచ్చాల్సిందే.. హీరో కామెంట్స్ వైరల్..

10tv 4 days ago

Annapurna Studios : కొత్త దర్శకులకు సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళ కథ చెప్పి నిర్మాతలను ఒప్పించాల్సిందే. కొన్ని సంస్థలలో మేనేజర్లు, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్లు, నిర్మాతకు సంబంధించిన వాళ్ళు..

ఇలా చాలా మంది కథ వింటారు. తాజాగా హీరో అల్లరి నరేష్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా చేయాలంటే ఎవరెవరు కథ వినాలో చెప్పిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమాతో సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నిర్మాణంలో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా భాగమయ్యారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసారంటే మాములు విషయం కాదు. చంద్రమోహన్ రాసిన కథ అన్నపూర్ణ స్టూడియోలో నిమ్మకాయల ప్రసాద్, సుప్రియ, నాగచైతన్య, నాగార్జున గారు ఇలా అందరికీ చెప్పి ఒప్పించాకే సినిమా ఓకే అయింది. వాళ్లందరినీ డైరెక్టర్ కన్విన్స్ చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయంలో మా సినిమా దర్శకుడు సక్సెస్ అయ్యాడు అని తెలిపాడు.

ఇటీవల నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఓ చిన్న సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ కొత్తవాళ్లు కొత్త కథలు ఉంటే తీసుకురండి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది అని అన్నారు. ఇప్పుడు నరేష్ చేసిన వ్యాఖ్యలతో అన్నపూర్ణ స్టూడియోస్ లో కథ ఓకే అవ్వాలంటే నిమ్మకాయల ప్రసాద్, సుప్రియ, నాగచైతన్య, నాగార్జున.. ఇలా నలుగురిని ఒప్పించాల్సిందే. అయితే ఇది ఫైనల్ లెవల్. ముందు వాళ్ళ దగ్గరకు వెళ్లాలంటే అన్ని చోట్ల లాగే కింద లెవల్ లో మేనేజర్స్, ఎగ్జిగ్యూటివ్ నిర్మాతలకు కూడా కథ చెప్పాల్సిందే. కొత్త దర్శకులు వాళ్ళందర్నీ తమ కథతో ఒప్పించగలం అని నమ్మకం ఉంటే ట్రై చేయొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv