Dailyhunt
Apple iPhone 17 : వారెవ్వా.. ఆపిల్ ఐఫోన్ 17 ఇంత తక్కువా..? ఏకంగా రూ. 11వేల డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?

Apple iPhone 17 : వారెవ్వా.. ఆపిల్ ఐఫోన్ 17 ఇంత తక్కువా..? ఏకంగా రూ. 11వేల డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?

10tv 1 week ago
  • ఆపిల్ ఐఫోన్ 17పై కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్‌
  • ఐఫోన్‌పై రూ. 11వేలు డైరెక్ట్ డిస్కౌంట్ ఆప్షన్
  • ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులతో 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్

Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? మీకోసం ఆపిల్ ఐఫోన్ ఐఫోన్ 17 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఆపిల్ ఐఫోన్ ధర రూ. 11వేల వరకు తగ్గింది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ సాషా లేలే సేల్ ఈ ఐఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.

ఈ సేల్ మే 9న ప్రారంభం కానుంది. ఇందులో ఐఫోన్ 17పై అందించే డీల్ అత్యంత (Apple iPhone 17) ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు ఈ సేల్‌లో 24 గంటల ముందే (మే 8న) యాక్సస్ పొందవచ్చు. ఈ సేల్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 భారీ తగ్గింపుతో లభిస్తోంది. మే 9న ప్రారంభమయ్యే ఈ సేల్ మే 8 నుంచి ప్లస్, బ్లాక్ మెంబర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 17పై కంపెనీ భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది.

ఆపిల్ ఈ ఫోన్‌ను గత సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో రూ. 82,900 ధరకు లాంచ్ చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 71,900కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్‌పై నేరుగా రూ. 11వేలు తగ్గింపు లభిస్తుంది.

ఐఫోన్ 17పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ :
మీ ఐఫోన్ 17 కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కూపన్ కార్డులు కూడా పొందవచ్చు. కంపెనీ ఇంకా అన్ని బ్యాంక్ ఆఫర్లను వెల్లడించలేదు. అయితే, ఐఫోన్ 17పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్‌లో ఇదొకటి. ఎస్‌బీఐ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 ప్రోమోషన్‌తో 120Hz డిస్‌ప్లే అందిస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. తద్వారా పవర్ భారీ ఆదా చేస్తుంది. ఐఫోన్ 17లో ఆపిల్ A19 చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్‌లో 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుందని కంపెనీ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv