Assam Elections Results 2026 Live : అసోంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. క్లియర్ కట్ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. 71 మేజిక్ ఫిగర్ కాగా, 98 నియోజకవర్గాల్లో ఆధిక్యంతో దూసుకెళ్తోంది.

అసోంలో కాంగ్రెస్ ఓటమిపై బీజేపీ రాహుల్ గాంధీని ఎటాక్ చేసింది. రాహుల్ గాంధీ 99 ఓటములు అంటూ ఎద్దేవా చేసింది. రాహుల్ సెంచరీకి దగ్గరలో ఉన్నాంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేసింది.
అసోంలో కాంగ్రెస్ ఫేస్ గా మారిన గౌరవ్ గొగోయ్ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి గోస్వామి 11000 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు.
సెంట్రల్ గువాహటిలో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి గుప్తా 24000 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు.
సీఎం హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఆయన పోటీ చేస్తున్న జలుక్ బరి నియోజకవర్గంలో లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు.
ఎర్లీ ట్రెండ్స్ లో సీఎం హిమంత బిశ్వ శర్మ ముందంజలో ఉన్నారు. ఆయన జల్ కుబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 
అసోంలో వెలువడుతున్న తొలిదశ ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో దూసుకుపోతోంది. కాంగ్రెస్, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు డీలా పడ్డాయి.
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా అస్సాం ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. అస్సాంలో హ్యాట్రిక్ సాధించగలమని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ధీమాతో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా.. 85.96శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నిలక బరిలో ఉన్న ప్రముఖులలో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఉన్నారు.

