Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Balakrishna- Koratala: నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. బాలయ్య- కొరటాల సినిమాకు అనిరుధ్ మ్యూజిక్

Balakrishna- Koratala: నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. బాలయ్య- కొరటాల సినిమాకు అనిరుధ్ మ్యూజిక్

10tv 2 weeks ago
  • బాలయ్య కొరటాల క్రేజీ మాస్ కాంబో
  • మ్యూజిక్ డైరెక్టర్‌గా సెన్సేషన్ అనిరుద్
  • థియేటర్లలో సౌండ్ బాక్సులు పగిలిపోతాయి

Balakrishna- Koratala: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే.

వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య, సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అందించే కొరటాల శివతో జతకట్టడం ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా, ‘దేవర 2’ వంటి బిగ్ ప్రాజెక్టును పక్కన పెట్టి మరి కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్‌పై వర్క్ చేయడం చూస్తుంటే, ఈ మూవీ లెవల్ ఏంటో అర్థమవుతోంది. ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి అంచనాలు స్కై హై రేంజ్‌కు చేరుకున్నాయి.

Shweta Basu Prasad: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు ముద్దుగా.. 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ ఎలా మారిపోయింది చూడండి!

ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్‌గా ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నాడట. ఆల్రెడీ కొరటాల శివ(Balakrishna- Koratala)తో కలిసి ‘దేవర’ మూవీకి అనిరుద్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇచ్చి రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను బాలయ్య సినిమా కోసం రిపీట్ చేయబోతున్నాడనే న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అనిరుద్ బ్రాండ్, అతని హై-వోల్టేజ్ బిట్స్ బాలయ్య మాస్ ఇమేజ్‌కు తోడైతే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న అనిరుద్, ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం సినిమా రేంజ్‌ను ఒక్కసారిగా మార్చేసింది. బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకు అనిరుద్ ఇచ్చే ఎనర్జిటిక్ మ్యూజిక్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. త్వరలోనే ఈ మ్యూజికల్ కాంబోపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ గనుక సెట్ అయితే, థియేటర్లలో సౌండ్ బాక్సులు పగిలిపోవడం గ్యారెంటీ అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv