Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandla Ganesh : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పవర్ స్టార్ తో బండ్లన్న.. వీడియోలు వైరల్..

Bandla Ganesh : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పవర్ స్టార్ తో బండ్లన్న.. వీడియోలు వైరల్..

10tv 3 days ago

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమాని అని తెలిసిందే. ఏకంగా పవన్ కి తాను భక్తుడు అని చెప్పుకుంటాడు బండ్ల గణేష్. నటుడిగా, నిర్మాతగా ఫేమ్ తెచ్చుకున్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పవన్ కి ఎలివేషన్స్ ఇస్తూ మాట్లాడి పలుమార్లు వైరల్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన స్పీచ్ లతో బండ్ల గణేష్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.

అయితే గత కొన్నాళ్లుగా పవన్, బండ్ల గణేష్ కలిసి కనిపించలేదు. పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా బండ్ల గణేష్ రాలేదు. బండ్లన్న రావాలి, మాట్లాడాలి అని పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు కానీ బండ్ల గణేష్ రాలేదు. అయితే తాజాగా చాన్నాళ్ల తర్వాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని కలిశారు.

నేడు చిరంజీవి 158వ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు రాగా బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. చాన్నాళ్ల తర్వాత కలవడంతో పవన్ కళ్యాణ్ బండ్లన్నని ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడారు. బండ్ల గణేష్ తో కలిసి ఫోటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు.

ఇలా బండ్ల గణేష్ - పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో క్లోజ్ గా చాన్నాళ్ల తర్వాత కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని కలిసిన వీడియోలు వైరల్ గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv