Bandla Ganesh : ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ పై రెగ్యులర్ గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు సంబంధం లేని విషయాల్లో కూడా ప్రకాష్ రాజ్ పవన్ పై కామెంట్స్ చేస్తూ వైరల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.
పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, నెటిజన్లు ప్రకాష్ రాజ్ ని ఎంత విమర్శించినా ఆయన మాత్రం ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు.
ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ జరిగిన సంగతి తెలిసిందే. భారదేశంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చు అనే హక్కు ఉందంటూ పవన్ తెలంగాణాలో కూడా జనసేన పోటీ చేస్తుందని అన్నారు. దీనిపై ప్రకాష్ రాజ్.. మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి అంటూ ట్వీట్ వేసాడు. దీనిపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా బండ్లగణేష్ ఈ ట్వీట్ కి ఘాటు రిప్లై ఇచ్చాడు.
బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో.. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్ అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో బండ్లన్న ట్వీట్ వైరల్ గా మారింది.
అలాగే.. ప్రకాష్ రాజ్ నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతి విషయానికీ 'జస్ట్ ఆస్కింగ్' అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నీ సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలు కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది-ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బండ్లన్న.

