- ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్
- ఈ మైలురాయిని సాధించిన ఏకైక పేసర్
Bhuvneshwar Kumar : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు ఆయుష్ మాత్రే వికెట్ తీయడం ద్వారా రికార్డులకు ఎక్కాడు.
ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడి కన్నా ముందు యుజ్వేంద్ర చహల్ ఈ ఘనత సాధించాడు. మొత్తంగా సీఎస్‌కే మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లు వీరే..
* భువనేశ్వర్ కుమార్ – 192 ఇన్నింగ్స్‌లలో 202 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 147 ఇన్నింగ్స్‌లలో 183 వికెట్లు
* డ్వేన్ బ్రావో – 158 ఇన్నింగ్స్‌లలో 183 వికెట్లు
* లసిత్ మలింగ – 122 ఇన్నింగ్స్‌లలో 170 వికెట్లు
* హర్షల్ పటేల్ – 118 ఇన్నింగ్స్‌లలో 151 వికెట్లు
ఐపీఎల్‌లో అత్యదిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* యుజ్వేంద్ర చహల్ – 176 మ్యాచ్‌ల్లో 224 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 192 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు
* సునీల్ నరైన్ – 191 మ్యాచ్‌ల్లో 193 వికెట్లు
* పీయూష్ చావ్లా – 192 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 221 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (70 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (50; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర అర్థశతకాలు బాదారు. రజత్ పాటిదార్ (19 బంతుల్లో 48 నాటౌట్), ఫిల్ సాల్ట్ (30 బంతుల్లో 46 పరుగులు ) చాలా వేగంగా ఆడారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, శివమ్ దూబే లు తలా ఓ వికెట్ తీశారు.
251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగులకు ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ (50; 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకం బాదాడు. ప్రశాంత్ వీర్ (29 బంతుల్లో 43 పరుగులు, జేమీ ఓవర్టన్ (16 బంతుల్లో 37 పరుగులు) లు రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. జాకబ్ డఫీ, అభినందన్ సింగ్, కృనాల్ పాండ్యా లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. సుయాష్ శర్మ ఓ వికెట్ సాధించాడు.

