Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 టెలికాస్ట్ ఎప్పట్నుంచో తెలుసా? లీక్ అయిన స్ట్రీమింగ్ డేట్..

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 టెలికాస్ట్ ఎప్పట్నుంచో తెలుసా? లీక్ అయిన స్ట్రీమింగ్ డేట్..

10tv 1 week ago

Bigg Boss 10 Telugu : తెలుగులో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులో తొమ్మిది సీజన్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు పదో సీజన్ కి రెడీ అయింది.

ఇప్పటికే సామాన్యులను బిగ్ బాస్ కి తీసుకెళ్లే అగ్నిపరీక్ష కు ఆడిషన్స్ తీసుకొని అందులో పాల్గొనే వాళ్లకు ఫైనల్ పరీక్ష కూడా రెడీ అయింది. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఆగస్టు 15 నుంచి స్టార్ మా ఛానల్ లో, జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

దాదాపు 15 రోజుల పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సాగనుంది. దీంతో బిగ్ బాస్ ఫాలోవర్స్ అగ్ని పరీక్ష షో కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ షో టెలికాస్ట్ డేట్ లేక్ అయింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 ఆదివారం నుంచి టెలికాస్ట్ మొదలవ్వనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 6 ఆదివారం నాడు కంటెస్టెంట్స్ ని గ్రాండ్ గా హౌస్ లోకి పంపి సెప్టెంబర్ 7 నుంచి అసలైన అట మొదలు కానుంది. దాదాపు 15 వారాల పాటు ఈ షో సాగనుంది.

స్టార్ మా ఛానల్ లో ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాలు రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ టెలికాస్ట్ అవ్వనుంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో కూడా ఈ షో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ ని హోస్ట్ చేయబోతున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ లోకి వచ్చే సెలబ్రిటీలు, సామాన్యులు ఎవరో చూడాలంటే ఇంకో నెల రోజులు ఎదురు చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv