Dailyhunt
BJP Candidate List 2026 : తమిళనాడు అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ.. అన్నామలైకి బిగ్ షాక్.. ఎందుకిలా..?

BJP Candidate List 2026 : తమిళనాడు అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ.. అన్నామలైకి బిగ్ షాక్.. ఎందుకిలా..?

10tv 1 week ago
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాల్లో బీజేపీ పోటీ
  • అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాషాయ పార్టీ
  • అన్నామలైకి దక్కని చోటు

BJP Candidate List 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది.

ఈ క్రమంలో పార్టీలన్నీ నామినేషన్లు, అభ్యర్థుల ప్రకటన, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా బీజేపీ.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ పరిశీలించిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. కారణం తమిళనాట బీజేపీ కీలక నేత అయిన అన్నామలైకి.. ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఆయనను ఈ ఎన్నికల బరి నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బీజేపీ శుక్రవారం నాడు 27 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రుల నుంచి మాజీ గవర్నర్ల వరకు పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ జాబితాలో తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పేరు లేదు. బీజేపీ వెల్లడించిన అభ్యర్థుల జాబితా పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నుంచి మాజీ గవర్నర్ సుందరరాజన్ వరకు పలువురి పేర్లు ఉన్నాయి. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ పేరు కూడా జాబితాలో ఉంది. ఆమె మైలాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. కోయంబత్తూరు (ఉత్తర) స్థానం నుంచి పార్టీ వనతి శ్రీనివాసన్‌ను నామినేట్ చేసింది. అయితే అన్నామలై కోయంబత్తూర్ నార్త్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ బీజేపీ మాత్రం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వనతీ శ్రీనివాసన్‌కే మరోసారి అవకాశం కల్పించడంతో అన్నామలైకి పోటీ చేసేందుకు అవకాశం లభించలేదు. దీంతో పాటు రామనాథపురం సీటును అన్నామలైకి ఇస్తారని భావించినా.. అక్కడ జీబీఎస్‌కే నాగేంద్రన్‌కు కేటాయించడం గమనార్హం.

అస్సాం టీ తోటల్లో.. మహిళా శ్రామికులతో ప్రధాని మోదీ..

బీజేపీ సత్తూరు నుంచి నైనార్ నాగేంద్రన్‌ను, తిరుప్పూర్ (దక్షిణ) నుంచి ఎస్. తంగరాజ్‌ను బరిలోకి దింపింది. ఇక.. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే.. ఎన్డీయే కూటమిలోని బీజేపీ సహా కీలక భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం ఒప్పందాన్ని అన్నాడీఎంకే గతంలో ఖరారు చేసింది. బీజేపీ 27 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అంటే బీజేపీ మొత్తం 27 స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒక విడతలో పోలింగ్ జరగనుంది. బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో కలిసి మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

ఎన్నికల వేళ విజయ్ పై కేసు నమోదు.. పోటీ చేస్తున్న ఊళ్ళోనే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv