Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Buchibabu Sana : మెగాస్టార్ తో బుచ్చిబాబు సినిమా.. చిరంజీవి ఏమన్నారంటే..

Buchibabu Sana : మెగాస్టార్ తో బుచ్చిబాబు సినిమా.. చిరంజీవి ఏమన్నారంటే..

10tv 1 day ago

Buchibabu Sana : సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా దాదాపు పదేళ్లు పనిచేసి ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారాడు బుచ్చిబాబు సాన. ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టిలను పరిచయం చేస్తూ కొత్తవాళ్ళతోనే వంద కోట్లు సాధించి హిట్ కొట్టాడు బుచ్చి.

ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పటికే 370 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా.

ఈ రెండు కథలు కూడా బుచ్చిబాబు చిరంజీవికి ముందే చెప్పారు. తాజాగా చిరంజీవి పెద్ది సినిమా చూసి బుచ్చిబాబుని పిలిచి అభినందిస్తూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. వైష్ణవ్ తో ఉప్పెన ఇచ్చారు, చరణ్ తో పెద్ది ఇచ్చారు. మీతో కూడా ఒక ఛాన్స్ ఇస్తే సినిమా చేస్తాను అని చిరంజీవిని ఛాన్స్ అడిగేశాడు. దీంతో చిరు.. నువ్వు అలా పరిగెత్తు, దూకమని, సాహసాలు చేయాలని అంటే నేను వెళ్ళమని చెప్తా అని సరదాగా అన్నారు. ప్రస్తుతానికి అయితే చిరు లైనప్ బిజీగానే ఉంది. మరి బుచ్చిబాబు తర్వాత సినిమా ఎవరితో చేస్తాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv