Dailyhunt
Chengicherla Case : చెంగిచెర్లలో సంచలన కేసు.. అత్తపై అల్లుడి దాడి.. ఫిట్స్ అంటూ డ్రామా.. కట్ చేస్తే అసలు నిజం వెలుగులోకి!

Chengicherla Case : చెంగిచెర్లలో సంచలన కేసు.. అత్తపై అల్లుడి దాడి.. ఫిట్స్ అంటూ డ్రామా.. కట్ చేస్తే అసలు నిజం వెలుగులోకి!

10tv 1 week ago
  • చెంగిచెర్లలో సంచలన సృష్టించిన ఘటన
  • అత్తను బలవంతంగా తీసుకెళ్లి దాడి చేసిన అల్లుడు
  • తలపై హెల్మెట్ తో బాదడంతో తీవ్రగాయాలు
  • ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి కిందపడిందంటూ డ్రామా

Chengicherla Case : మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఓ కేసు సంచలనం సృష్టిస్తోంది. అల్లుడి దాడిలో అత్త మృతి చెందిన ఘటన ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. అత్తను బలవంతంగా తీసుకెళ్లిన అల్లుడు చివరికి ఆమె ఫిట్స్ వచ్చి చనిపోయిందంటూ డ్రామా ప్లే చేశాడు. చివరికి అతడే దాడి చేసి చంపినట్టు సీసీ ఫుటేజీలో బయటపడింది.

ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లుడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. చెంగిచెర్లలో కర్రు కావ్య (19) అనే యువతి, స్నేహిత్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి ఇద్దరూ అదే కాలనీలో నివాసమంటున్నారు.

కావ్య పేరెంట్స్ కూడా అదే కాలనీలో నివాసముంటున్నారు. సరిగ్గా ఏడాదిలోనే ఇరు కుటుంబాల్లో వివాదం చెలరేగింది. ఏప్రిల్ 28న తల్లి ఇంటికి కావ్య వెళ్లింది. అదే రోజు రాత్రి అత్తకు ఫోన్ చేసి స్నేహిత్ అసభ్యంగా మాట్లాడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో అల్లుడి మాటలకు అత్త అరుణ మానసిక ఆందోళనకు గురైంది.

మరుసటి రోజున (ఏప్రిల్ 29) మధ్యాహ్నం అత్తను స్నేహిత్ బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన అల్లుడు స్నేహిత్ హెల్మెట్‌తో అత్త తలపై దాడి చేశాడు.

దాంతో ఆమె బైక్‌పై నుంచి రోడ్డుపై పడింది. వెంటనే అతడు భయంతో ఫిట్స్ వచ్చి పడిపోయింది అంటూ స్నేహిత్ ఫోన్ చేసి కావ్యకు చెప్పాడు. ఆ తర్వాత బాధితురాలు అరుణను మెడిస్టార్ ఆసుపత్రి ఆర్‌బీఎం ఆసుపత్రికి తరించారు.

స్నేహిత్ చెప్పిన మాటలు కావ్య నమ్మలేదు. అనుమానంతో కావ్య సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీలో స్నేహిత్, బైక్‌పై వెళ్లే సమయంలో అరుణతో వాగ్వాదానికి దిగినట్లుగా కనిపించింది.

హెల్మెట్‌తో ఆమె తలపై దాడిచేసినట్టు స్పష్టంగా రికార్డు అయింది. అదే క్రమంలో ఆమె బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న అత్త అరుణ మృతిచెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv