Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dragon : రెండు పార్టులుగా డ్రాగన్ మూవీ?

Dragon : రెండు పార్టులుగా డ్రాగన్ మూవీ?

10tv 3 days ago

Dragon : ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వస్తున్న డ్రాగన్‌ మూవీ గ్లింప్స్‌ మూవీపై హైప్‌ను పెంచేసింది. అయితే డ్రాగన్‌ పార్ట్‌-1 రిలీజ్‌కు ఇంకా వన్ ఇయర్ టైమ్ ఉంది.

కానీ.. అప్పుడే డ్రాగన్‌ పార్ట్‌-2పై ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ స్టోరీ బిగ్ స్కేల్‌లో ఉండటంతో రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. గ్లింప్స్ రిలీజ్ అయినా.. పార్ట్-2పై అనౌన్స్ చేయకపోయినా డ్రాగన్‌-2పై గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. పార్ట్-2 షూటింగ్ కూడా ప్యార్‌లల్‌గా పూర్తి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

డ్రాగన్‌ పార్ట్-1 జూన్ 11, 2027న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. డ్రాగన్‌ పార్ట్‌-2ను కూడా ఆరు నెలల గ్యాప్‌లోనే అంటే డిసెంబర్ 2027లో విడుదల చేసేలా మూవీ మేకింగ్ నడుస్తోందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్‌ యూనివర్స్‌గా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. సలార్ స్ట్రాటజీ లాగా రెండు పార్టులను ఒకేసారి షూట్ చేసి క్లోజ్ గ్యాప్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు డిస్కషన్స్ నడుస్తున్నాయి.

అఫ్గానిస్థాన్ 1967 సెట్టింగ్ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ వరకు నడిచే స్టోరీలో ఎమోషన్, యాక్షన్ ఎక్కువగా ఉండటంతో సింగిల్‌ పార్టుగా తీసుకురాలేకపోతున్నారట. ఎన్టీఆర్ లీన్ లుక్‌తో పార్ట్-1 కోసం ట్రాన్స్‌ఫార్మ్ అయి, పార్ట్ 2 కోసం మళ్లీ బల్క్‌ అవుతున్నట్లు చెబుతున్నారు. నీల్ స్టైల్‌లో ఇది పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గ్లింప్స్ రిలీజ్ తర్వాత డ్రాగన్‌-2పై ఊహాగానాలు ఎక్కువైపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv