Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
DWCRA Loans: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆ చార్జీలు ఉండవు

DWCRA Loans: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆ చార్జీలు ఉండవు

10tv 2 weeks ago
  • డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్
  • రుణాలపై అదనపు ఛార్జీలు రద్దు
  • వేల కోట్ల మేర లబ్ధి

DWCRA Loans: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

పొదుపు సంఘాల మహిళలు తీసుకునే జీవనోపాధి రుణాలపై బ్యాంకులు విధిస్తున్న ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో బ్యాంకులు వెనక్కి తగ్గాయి. ఇప్పటికే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోగా, తాజాగా జూలై 1 నుంచి ఈ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) కీలక ప్రకటన చేసింది.

EPF New Rules: ఈపీఎఫ్ రూల్స్ మారాయి.. విత్‌డ్రా పై ఆంక్షలు.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రంలో అత్యధికంగా 3 లక్షల డ్వాక్రా సంఘాలు ఈ యూనియన్ బ్యాంక్ పరిధిలోనే ఉన్నాయి. గతంలో రూ.10 లక్షలు దాటిన రుణాలపై ప్రతి లక్షకు రూ.350 ప్రాసెసింగ్ ఫీజు, రూ.5 లక్షలు దాటిన రుణాలపై త్రైమాసికానికి రూ.500 చొప్పున ఇన్‌స్పెక్షన్ ఛార్జీలు వసూలు చేసేవారు. తాజా రద్దు నిర్ణయంతో ఒక్కో సంఘానికి ఏడాదికి రూ.33 వేల వరకు ఆదా అవుతుంది. తద్వారా యూబీఐ పరిధిలోని మహిళలకు దాదాపు రూ.1,000 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

మిగిలిన గ్రామీణ బ్యాంకులు, ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఈ ఛార్జీలను రద్దు చేయించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్‌ఎల్‌బీసీ ఉపకమిటీని కూడా ఏర్పాటు చేశారు. సీఎం చొరవతో త్వరలోనే రాష్ట్రంలోని 11 లక్షల డ్వాక్రా(DWCRA Loans) సంఘాల మహిళలందరికీ ఈ అదనపు ఛార్జీల భారం తప్పనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv