Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EPF Scheme 2026 : EPFO కొత్త రూల్.. మీ శాలరీ ఎంతైనా రూ.1800 పీఎఫ్ కటింగ్.. చేతికి అందే జీతం పెరగనుందా? ఉద్యోగికి లాభమా నష్టమా?

EPF Scheme 2026 : EPFO కొత్త రూల్.. మీ శాలరీ ఎంతైనా రూ.1800 పీఎఫ్ కటింగ్.. చేతికి అందే జీతం పెరగనుందా? ఉద్యోగికి లాభమా నష్టమా?

10tv 2 weeks ago
  • ఈపీఎఫ్ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
  • 1952 నాటి పాత స్కీమ్ స్థానంలో కొత్త పథకం
  • జీతం ఎంత ఉన్నా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ. 18వేలే
  • ఎక్కువ పీఎఫ్ కటింగ్ అనేది మీదే ఛాయిస్

EPF Scheme 2026 : ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. పీఎఫ్ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టింది. కొత్త EPFO ​​నిబంధన ప్రకారం.. ఉద్యోగి జీతం రూ. 50,000 అయినా లేదా రూ. 5 లక్షలైనా పీఎఫ్ నుంచి కేవలం రూ. 1800 మాత్రమే కట్ అవుతాయి.

ఉద్యోగి కనీస వేతనంతో సంబంధం లేకుండా కంపెనీ తమ ఉద్యోగికి చెల్లించే పీఎఫ్ మొత్తాన్ని నెలకు కేవలం రూ. 1800 చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. టేక్ హోం శాలరీ పెరుగుతుందా? ఈ కొత్త నిబంధనతో ఉద్యోగికి లాభామా? లేదా కంపెనీకి లాభమా? వీరిలో ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు? అసలు ఎవరు (EPF Scheme 2026) నష్టపోతారు? పీఎఫ్ ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయించేది? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1952 నాటి పాత స్కీమ్ ఇప్పుడు మారింది. ఆ స్థానంలో కొత్త ఈపీఎఫ్ పథకం 2026 అమల్లోకి వస్తుంది. ఇందులో పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇకపై పీఎఫ్ ఎంత కట్ అవ్వాలి అనేది నిర్ణయించుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది. రూ. 1800 కన్నా ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కట్ అవ్వాలనుకుంటే స్వచ్చంధంగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఉద్యోగి, కంపెనీ మధ్య పరస్పర అంగీకారం తప్పనిసరి.

తద్వారా పీఎఫ్ కటింగ్ తగ్గి ఉద్యోగులకు టేక్ హోం శాలరీ పెరుగుతుంది అనమాట. ఉద్యోగి పీఎఫ్ అనేది బేసిక్ శాలరీ, డీఏ (DA) ఆధారంగా లెక్కిస్తారు. నిబంధనల ప్రకారం.. ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ తమ బేసిక్ జీతంలో 12శాతం పీఎఫ్‌కు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్‌ కోసం ప్రభుత్వం నెలకు రూ. 15,000 పరిమితిని నిర్దేశించింది. అంటే.. రూ. 15వేలలో 12శాతం విత్‌డ్రా చేస్తే.. అది రూ. 1,800 వేలు అవుతుంది.

మీ బేసిక్ జీతం లక్ష రూపాయలు ఉన్నా కంపెనీలు కేవలం రూ.15,000 పరిమితిని ఆధారంగా తమ కాంట్రిబ్యూషన్ నెలకు రూ. 1,800గా నిర్ణయించుకోవచ్చు. ఈ పరిమితికి మించిన కటింగ్ ఉండాలన్నా పూర్తిగా ఉద్యోగి, కంపెనీ విధానంపై ఆధారపడి ఉంటుంది.

పాత రూల్ ఏంటి?
ప్రస్తుత విధానంలో ఉద్యోగి బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్‌పై 12శాతం పీఎఫ్ కట్ అవుతుంది. అదే మొత్తాన్ని కంపెనీ కూడా చెల్లిస్తుంది. అంటే.. జీతం ఎక్కువైతే పీఎఫ్ కూడా ఎక్కువగా కట్ అవుతుంది. కానీ, రిటైర్మెంట్ సమయంలో మంచి సేవింగ్స్‌గా మారుతుంది.

కొత్త పీఎఫ్ రూల్ :
బేసిక్ శాలరీ రూ.15,000 లోపు ఉంటే తప్పనిసరిగా EPFలో చేరాలి. అప్పుడు కాంట్రిబ్యూషన్‌ రూ.1800కు పరిమితం అవుతుంది. అంతకంటే ఎక్కువ చెల్లించాలంటే ఉద్యోగి-కంపెనీ అంగీకారంతో స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు.

ఎవరికి లాభం? :
టేక్ హోమ్ శాలరీ పెరగాలని కోరుకునే ఉద్యోగులకు అధిక లాభం. నెలవారీ చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. అలాగే కంపెనీలకు కూడా ఖర్చు తగ్గుతుంది, ముఖ్యంగా భారీ వర్క్‌ఫోర్స్ ఉన్న సంస్థలకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

ఎవరికి నష్టం? :
దీర్ఘకాలిక సేవింగ్స్ పరంగా ఉద్యోగులకు భారీ నష్టం కలగొచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ తక్కువగా పెరుగుతుంది. రిటైర్మెంట్ కార్పస్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

టేక్ హోమ్ శాలరీ పెరుగుతుందా? :
పీఎఫ్ కటింగ్ తక్కువైతే తాత్కాలికంగా అందే జీతం చేతికి ఎక్కువగా వస్తుంది. కానీ, భవిష్యత్ సేవింగ్స్ భారీగా తగ్గే ప్రమాదం ఉంటుంది.

చివరిగా జీతం ఎక్కువ.. సేవింగ్స్ తక్కువ అనేవారికి బెస్ట్ ఆప్షన్.. ఉద్యోగి తాత్కాలిక లాభమే కోరుకుంటే బెనిఫిట్.. దీర్ఘకాల భద్రత కోరుకుంటే పాత విధానం బెటర్‌ అని చెప్పొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv