Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EPFO: EPF చందాదారులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయ్.. ఎంత? ఎప్పుడు? ఫుల్ డిటెయిల్స్

EPFO: EPF చందాదారులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయ్.. ఎంత? ఎప్పుడు? ఫుల్ డిటెయిల్స్

10tv 2 weeks ago
  • ఈపీఎఫ్ వడ్డీ జమ త్వరలోనే
  • డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది
  • క్లెయిమ్ పరిమితి పెరిగింది భారీగా

EPFO: ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్వో (EPFO)సంస్థ సరికొత్త డిజిటల్ సంస్కరణలతో పాటు వడ్డీ జమ రూపంలో తీపి కబురు అందించింది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సేవలను మరింత వేగవంతం, పారదర్శకం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరడమే కాకుండా, పాత పద్ధతులకు స్వస్తి పలికినట్లయింది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 8.25 శాతం వార్షిక వడ్డీని జులై 15 నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.1.44 లక్షల కోట్ల సొమ్మును కేటాయించారు. గతంలో ఈ వడ్డీ జమ కావడానికి సెప్టెంబరు-అక్టోబరు వరకు సమయం పట్టేది, కానీ ఈసారి ఆటోమేటెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కేవలం వారం రోజుల్లోనే ప్రాసెస్ పూర్తి కానుంది.

దీనితో పాటు ఈపీఎఫ్‌ఓ ‘సెంట్రలైజ్డ్‌ ఐటీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌’ ద్వారా జాతీయ డేటాబేస్‌ను ఏర్పాటు చేసింది. ఇకపై వేర్వేరు పోర్టల్స్ అవసరం లేకుండా ఒకే ‘యునిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌’ ద్వారా బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దేశంలో ఏ ప్రాంతీయ కార్యాలయం నుంచైనా సేవలు పొందే వీలుండటంతో పాటు, ఆటోమెటెడ్‌ క్లెయిమ్‌ పరిమితిని కూడా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచుతూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv