- ఫ్లిప్‌కార్ట్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ప్రారంభ ధర రూ.86,200
- బజాజ్ చేతక్ C3503 సింగిల్ ఛార్జ్‌పై 151 కిలోమీటర్ల రేంజ్
- టీవీఎస్ స్పోర్ట్ రూ.48వేల ప్రారంభ ధరతో లభ్యం కానుంది
Flipkart Freedom Sale : కొత్త బైకు లేదా స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగస్టు 8న ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక అద్భుతమైన డీల్స్‌ను వెల్లడించనుంది. మీరు కొత్త బైకు లేదా స్కూటర్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపు ధరకే మీకు నచ్చిన బైకు, స్కూటర్ ఏదైనా కొనేసుకోవచ్చు.
ప్రస్తుతం మీకోసం కొన్ని బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ డీల్స్‌కు (Flipkart Freedom Sale) సంబంధించి ఫ్లిప్‌కార్ట్ ఒక విషయాన్ని రివీల్ చేసింది. సేల్ ప్రారంభమైన తర్వాత అసలైన డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందించే ఈ ధరలు కేవలం ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. రిజిస్ట్రేషన్, టాక్సు, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఛార్జీలతో అసలు ధర ఇంకా ఎక్కువగా ఉండొచ్చు.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125 :
ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ సమయంలో ఈ బైకు రూ.86,200 ప్రారంభ ధరతో లభిస్తుంది. 125cc V ఇంజన్ ఉంది. 11.4bhp పవర్ 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇందులో సెల్ఫ్ కిక్ స్టార్ట్ ఫెసిలిటీ ఉంది. వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
బజాజ్ చేతక్ C3503 :
ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ చేతక్ C3503 ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1,24,157 ప్రారంభ ధరతో లభ్యమవుతుంది. 186Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. PMSM స్వింగ్‌ఆర్మ్ మోటార్‌తో రన్ అవుతుంది. గంటకు 70 కిలోమీటర్ల టాప్ రేంజ్ అందుకోగలదు. సింగిల్ ఛార్జ్‌పై 151 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో సింగిల్-సైడెడ్, మోనోషాక్ సస్పెన్షన్ ఫీచర్లు ఉన్నాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్ :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.71,287 ప్రారంభ ధరతో లభ్యం కానుంది. స్ప్లెండర్ ప్లస్ 97.2cc ఇంజన్‌తో రన్ అవుతుంది. 8.05Nm టార్క్, 5.9kW పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఫ్యూయల్-ఇంజెక్టెడ్ బైక్ సెల్ఫ్-స్టార్ట్ కిక్-స్టార్ట్ ఫీచర్లు అందిస్తుంది.
టీవీఎస్ స్పోర్ట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.48వేల ప్రారంభ ధరతో లభిస్తుంది. టీవీఎస్ స్పోర్ట్ 109.7cc ఇంజన్‌తో రన్ అవుతుంది. 8.7Nm టార్క్, 8.18bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ సింగిల్-సిలిండర్ బైక్‌కు 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అందిస్తుంది. ఇందులో ఎయిర్-కూల్డ్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,04,322 ప్రారంభ ధరతో లభిస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్‌లో BLDC హబ్-మౌంటెడ్ ట్రాక్షన్ మోటార్ అమర్చారు. 4.4 kW టాప్ పవర్, 140Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 94 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. గంటకు 75 కిలోమీటర్ల టాప్ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌కు ఛార్జింగ్ టైమ్ 2.75 గంటలు అందిస్తుంది.

